logo
Published : 04/12/2021 05:51 IST

అల్లరి మూకలను వదలొద్దు


సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ కోటేశ్వరమ్మ

సింగరాయకొండ గ్రామీణం(టంగుటూరు): కందులూరు సచివాలయంలో ఈ నెల ఒకటో తేదీన ఉపాధి పనుల సామాజిక తనిఖీల్లో అల్లర్లు చేసి ఘర్షణలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ అన్నారు. గ్రామ సచివాలయాన్ని శుక్రవారం ఆమె సందర్శించి మాట్లాడారు. ఉపాధి పనుల అవినీతిపై ప్రశ్నిస్తే అధికార పార్టీకి చెందిన కొందరు ఘర్షణకు దిగి, కార్యాలయ సామగ్రిని ధ్వంసం చేయడం దారుణం అన్నారు. ఇంత జరిగినా అధికారులు మౌనం వహించడం ఏమిటని ప్రశ్నించారు. గ్రామ సర్పంచి ఎస్సీ మహిళ కావడంతో అధికారులు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదన్నారు. సహకారం అందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. నాయకులు సత్యన్నారాయణ రాజు, దాసయ్య, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని