logo
Published : 04/12/2021 05:51 IST

దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు కృషి


గిద్దలూరు: సదస్సులో పాల్గొన్న న్యాయమూర్తులు బి.రాజేష్‌, వై.సరిత

దర్శి, న్యూస్‌టుడే: దివ్యాంగులను సమాజంలో భాగంగా చూడాలని వారిపై వివక్ష తగదని న్యాయమూర్తులు జీఎల్‌వీ ప్రసాద్‌, ఎస్సై వాణి అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక భవిత కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దివ్యాంగుల్లో కూడా సాధారణ వ్యక్తుల్లో ఉండే ప్రజ్ఞే ఉంటుందన్నారు. వారికి అందించే ధ్రువపత్రాల్లో అన్యాయం జరిగితే న్యాయపరంగా పరిష్కరిస్తామన్నారు. వారి హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం తూర్పుచౌటపాలేనికి చెందిన దివ్యాంగుడు జోసఫ్‌ 30 మంది దివ్యాంగులకు బ్యాగులు, నీటి సీసాలు అందించారు. ఎంఈవో రఘురామయ్య, సంఘ సేవకులు జీవీ.రత్నం, ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: సమాజంలో దివ్యాంగులను ఆదరించి వారికి ప్రత్యేక స్థానం కల్పించాలని ఎంఈవో బి.రాందాస్‌ నాయక్‌ అన్నారు. స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైకల్యం శరీరానికే తప్ప మనస్సుకు కాదని, వారు నేడు ప్రతి రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారని వివరించారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : దివ్యాంగులపై చిన్నచూపు తగదని గిద్దలూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి బి.రాజేష్‌ సూచించారు. ఆయన శుక్రవారం స్థానిక స్ఫూర్తి మానసిక పాఠశాల ఆవరణలో న్యాయవిజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని కోరారు. అదనపు కోర్టు న్యాయమూర్తిని వై.సరిత, ఎస్‌.ఐ. బ్రహ్మనాయుడు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జునరాయుడు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని