logo
Published : 04/12/2021 05:51 IST

పశ్చిమ ప్రకాశం సీపీఎం కార్యదర్శిగా హనీఫ్‌

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రకాశం సీపీఎం జిల్లా కార్యదర్శిగా సయ్యద్‌ హనీఫ్‌ మరోమారు ఎన్నికయ్యారు. మార్కాపురం పట్టణంలోని ఎస్వీకేపీ కళాశాలలో గత రెండు రోజులుగా జరిగిన జిల్లా మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శి హానీఫ్‌తో పాటు కార్యదర్శివర్గ సభ్యులుగా ఎం.రమేష్‌, డి.సోమయ్య, వి.ఆంజనేయులు, పిల్లి తిప్పారెడ్డి, ఊసా వెంకటేశ్వర్లు, పి.సి.కేశవరావు, రాజ్యలక్ష్మి, కె.మాల్యాద్రి, టి.ఆవులయ్య, జి.బాలనాగయ్య, టి.రంగారావు, ఒ.రతన్‌, డి.కె.ఎం.రఫీ, తోట తిరుపతిరావు ఎన్నికైన వారిలో ఉన్నారు. కమిటీ పేర్లను రాష్ట్ర నాయకత్వం మహాసభల్లో పాల్గొన్న ప్రతినిధుల సమక్షంలో ప్రకటించగా అందరూ చేతులెత్తి ఏకగీవ్రంగా ఆమోదం తెలిపినట్లు జిల్లా కార్యదర్శి చెప్పారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతిజ్ఞ చేసింది. పశ్చిమ ప్రకాశం అభివృద్ధి కోసం, ఇక్కడి ప్రజల పక్షాన అండగా నిలుస్తామని చెప్పింది.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని