logo
Published : 04/12/2021 05:51 IST

దర్శి ఫలితాలపై చంద్రబాబు సమీక్ష

ఈనాడు- అమరావతి: స్థానిక ఎన్నికల్లో వైకాపా దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడినా సరే తెదేపా మంచి ఫలితాలు సాధించిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల్లో వైకాపా పట్ల ఉన్న వ్యతిరేకత, ప్రకాశం జిల్లా నాయకులు, కార్యకర్తల సమిష్ఠి కృషితో దర్శి నగర పంచాయతీలో విజయం సాధించగలిగామని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘‘వైకాపా నేతలు గత రెండున్నరేళ్లుగా తెదేపా కార్యకర్తలను మానసికంగా, శారీరకంగా వేధించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి పార్టీని నిర్లక్ష్యం చేశా. ఇప్పుడు పార్టీని పునాదుల నుంచి సరైన నాయకత్వంతో బలోపేతం చేస్తున్నాం. 30 ఏళ్ల వరకూ స్థిరంగా ఉండే నాయకత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని అన్నారు. అనంతరం ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులను అభినందించారు. జిల్లా తెదేపా నాయకులు నూకసాని బాలాజీ, దామచర్ల జనార్దన్‌, ముత్తుములు అశోక్‌రెడ్డి, నారపుశెట్టి పాపారావు, పమిడి రమేష్‌తో పాటు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, బ్రహ్మం పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని