logo
Published : 04/12/2021 05:51 IST

జిల్లాలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ లేదు

● వైద్యఆరోగ్యశాఖ అధికారిణి వెల్లడి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఒంగోలులో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసు ఒకటి నమోదైందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్‌ పి.రత్నావళి తెలిపారు. పుకార్లు నమ్మి భయాందోళనకు గురికావద్దన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం విదేశాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణీకుల వివరాలు అందుతున్నాయన్నారు. వచ్చిన వారిని సంప్రదించి అవసరమైతే మరోసారి కొవిడ్‌ పరీక్షచేయాలని సూచించారన్నారు. అంతేకాక విదేశాల నుంచి వచ్చినవారు వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి వచ్చిన 200 మందికి పరీక్షలు చేశామన్నారు. అందరికీ నెగిటివ్‌ వచ్చిందన్నారు. ప్రయాణానికి ముందు కూడా పరీక్ష చేయించుకొని వస్తున్నారన్నారు. నగరంలోని సుజాతనగర్‌కు హాంకాంగ్‌ నుంచి వచ్చిన వారికి కూడా పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చిందన్నారు. జిల్లాలో ఇంతవరకు కొత్త వేరియంట్‌ వైరస్‌ లేదని స్పష్టంచేశారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని