logo
Published : 04/12/2021 05:51 IST

రూ.32 లక్షల గోల్‌మాల్‌పై విచారణ


విచారణ చేస్తున్న అడిషనల్‌ డీఎంహెచ్‌వో శ్రీనివాసులు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ఆసుపత్రుల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.32 లక్షల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో శుక్రవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు, సిబ్బందిని అధికారులు విచారణ చేశారు. 2006లో దూపాడు, వెంకటాద్రిపాలెం, పాలుట్ల, వై.పాలెం, దోర్నాల వైద్యశాలలకు మంజూరైన రూ.32 లక్షల హెచ్‌డీఎస్‌ నిధులను గోల్‌మాల్‌ చేశారని గతంలో వై.పాలెం ప్రభుత్వ వైద్యశాలలో యూడీసీగా పనిచేసిన మువ్వా వెంకటేశ్వరరావు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌వో డి.శ్రీనివాసులు, అధికారులు వైద్యుడు శ్రీనివాసరావు, ఇతర సిబ్బందిని విచారించారు. వారి నుంచి లిఖిత పూర్వకంగా వివరణ తీసుకున్నారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించారు.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని