logo
Published : 04/12/2021 05:51 IST

రాష్ట్రాలకు విపత్తు సాయమేంటి స్పీకర్‌ సార్‌!

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: రాష్ట్రాలకు కేంద్ర విపత్తు నిధుల సాయంపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంటులో ప్రశ్నించారు. కొవిడ్‌ కారణంగా మృతిచెందిన వారి వారసులకు ఇచ్చే పరిహారం మంజూరుకు నిబంధనల సవరణపై కేంద్రం తీసుకున్న చర్యల గురించి వివరాలు కోరారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ ఈ ఏడాది సెప్టెంబరులో నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ఏపీకి కేంద్ర వాటాగా రూ.895.20 కోట్లు, రాష్ట్ర వాటాగా రూ.297.60 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌ 25 దాకా కేంద్ర వాటా రూ.447 కోట్లు చొప్పున రెండు వాయిదాలకు రూ.894 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా మరణించిన సిబ్బంది కుటుంబసభ్యులకు రూ.50 వేలు చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని