logo
Published : 04/12/2021 05:51 IST

కాలువలోకి దూసుకెళ్లిన పాఠశాల వాహనం

 విద్యార్థులకు తప్పిన ముప్పు


బోల్తా పడిన వాహనం

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులను తీసుకొని పాఠశాలకు వస్తున్న ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన స్టీరింగ్‌ ఆటో అదుపు తప్పి సాగర్‌ కాలువలోకి ఒరిగింది. ఈ సంఘటన త్రిపురాంతకం మండలంలోని వెంగాయపాలెం-పాత అన్నసముద్రం గ్రామాల మధ్య శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ సమయంలో వాహనంలో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఎదురుగా వస్తున్న పాల వ్యాన్‌కు దారి ఇచ్చే క్రమంలో రోడ్డు అంచులో పాత అన్నసముద్రంలోని వివేకానంద ప్రైవేట్‌ పాఠశాల వాహనం కొద్దిగా ఒరిగింది. వెంటనే చుట్టుపక్కన పొలాల్లోని రైతులు వచ్చి చిన్నారులను బయటకు తీస్తుండగా పూర్తిగా కాలువలోకి ఒరిగి బోల్తాకొట్టింది. దీంతో మిగిలిన వారిని కూడా వెంటనే బయటకు తీశారు. నీరు తక్కువగా ఉండటంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వెంటనే వారిని ఇళ్లకు పంపించారు.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని