logo
Updated : 04/12/2021 12:45 IST

ఆ గంటలో ఏం  జరిగింది ? 

 టంగుటూరులో కిరాతకం 
 కలకలం రేపిన తల్లీ, కుమార్తెల హత్య


ఘటనాస్థలంలో గుమికూడిన స్థానికులు 

ఒంగోలు నేరవిభాగం, సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: *శుక్రవారం రాత్రి.. 7.20 గంటలు...టంగుటూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇంటి కింద పోర్షనులో అంతా సరదాగా కబుర్లాడుకుంటున్నారు. జలదంకి శ్రీదేవి(43), ఆమె కుమార్తె వెంకట లేఖన(21) కూడా వారిలో ఉన్నారు..
*రాత్రి సుమారు 8.30 గంటలు.. బంగారు దుకాణం నిర్వహించే జలదంకి రవికిషోర్‌ తన ఇంటికి వచ్చారు. అక్కడి దృశ్యం చూసి హతాశుడయ్యారు. హాలులో కుమార్తె రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. అక్కడికి కొద్దిదూరంలోనే భార్య శ్రీదేవి సైతం అదే స్థితిలో కనిపించారు. 
రక్తపు మడుగులో అత్యంత దారుణంగా గొంతుకోసిన స్థితిలో ఉన్న వారిని చూసి ఆయన బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కళ్లముందు దృశ్యాలను చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మండల కేంద్రం టంగుటూరులో పోలీసు స్టేషన్‌కు అత్యంత సమీపాన జరిగిన దారుణమిది. గంట వ్యవధిలో తమ సొంతింట్లోనే తల్లీకుమార్తెలను ఎవరో హత్యచేశారని తెలిసి టంగుటూరు నిలువెల్లా వణికిపోయింది. ఇంతకీ ఎవరా దుండగులు.? వారిని హతమార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది.. అసలేం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

 
మృతదేహాలు 

ఉన్నత విద్య అభ్యసిస్తూ..
రవికిషోర్‌కు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె వెంకట లేఖన చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్‌(సీఎస్‌ఈ) తృతీయ సంవత్సరం చదువుతోంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఇంటిలోనే ఉండి ఆన్‌లైన్‌ తరగతులకు ఆమె హాజరవుతున్నారు. చిన్న కుమార్తె వెంకట భావన కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఈ కుటుంబం గత 30 ఏళ్లుగా టంగుటూరు పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న సొంతింట్లో నివసిస్తున్నారు. రవికిషోర్‌ సుమారు రెండేళ్లుగా సింగరాయకొండ రోడ్డులో బంగారు దుకాణం నిర్వహిస్తున్నారు. రోజుమాదిరిగానే శుక్రవారం ఉదయం 9.30 గంటలకు దుకాణానికి వెళ్లారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆయన భార్య శ్రీదేవి దుకాణానికి రాగా రవికిషోర్‌ ఇంటికి వచ్చారు. భోజనం చేసి తిరిగి వెళ్లి భార్యను 4.30 గంటలకు ఇంటికి పంపారు. శ్రీదేవి, ఆమె కుమార్తె లేఖన సాయంత్రం 7.30 గంటల వరకు ఇంటికిందనే ఉన్నారు. స్థానికులతో కబుర్లు చెప్పారు. ఆ తర్వాత మొదటి అంతస్తులోకి వెళ్లారు. అప్పుడే లోపలికి ప్రవేశించిన దుండుగులు వారిని హత్య చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే హాలులో తొలుత వెంకట లేఖనను గొడ్డలితో గొంతునరికి చంపి.. ఆ తర్వాత ఆమె తల్లిని సైతం అదే మాదిరి మట్టుబెట్టినట్లు అర్థమవుతోంది. శ్రీదేవి మణికట్టు, చేతిపైనా పదునైన ఆయుధంతో నరికిన ఆనవాళ్లు ఉన్నాయి. హతుల వద్ద ఉన్న నాలుగు బంగారు గాజులు, బంగారు గొలుసులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. 


రవికిషోర్‌ కుటుంబం... వృత్తాల్లో హత్యకుగురైన వెంకట లేఖన, శ్రీదేవి 

పోలీసుల పరిశీలన
రవికిషోర్‌ నుంచి సమాచారం అందగానే టంగుటూరు ఎస్సై నాయబ్‌రసూల్‌ తమ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్, ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పరిశీలించారు. రవికిషోర్‌తో పాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఒంగోలు నుంచి డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం బృందాలు చేరుకున్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ సంఘటనా స్థలంలో తిరిగి రైల్వే స్టేషన్‌ పరిసరప్రాంతాల్లో తచ్చాడింది. 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని