logo
Updated : 04/12/2021 05:58 IST

మీ దగ్గరే అలా.. మేము నడిచేదెలా 

 అధ్వానంగా రహదారులు
 శాసనసభ్యుల  స్వగ్రామాల్లోనూ అదే దుస్థితి
 కొందరి వీధులు మాత్రం అద్దాలే


ఒంగోలు నగరంలోని వీఐపీ కాలనీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఇంటికి వెళ్లే దారి ఇది. ఎటువంటి గుంతలు లేకుండా చక్కగా ఉంది. 

జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా రహదారులు దారుణంగా ఉన్నాయి.  చివరికి శాసనసభ్యుల స్వగ్రామాలు, వీధుల్లో సైతం అదే పరిస్థితి. అక్కడ కూడా బాగుచేయించుకోలేని, కొత్తగా నిర్మించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొందరు ప్రజాప్రతినిధుల ఆవాస ప్రాంతాల్లో మాత్రం రోడ్లు చక్కగా మెరుస్తున్నాయి. అదే తరహాలో మిగతా నియోజకవర్గమంతటా మార్గాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్న ఆకాంక్ష ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. పలువురు నేతల పరిధిలో పరిస్థితి ఎలా ఉందో పరిశీలన ఇది. -న్యూస్‌టుడే బృందం


ఇదే కాలనీలో మంత్రి  నివాస మార్గం నుంచి కొంచెం ముందుకు వెళ్తే గద్దలగుంట నీటి ట్యాంకు వస్తుంది.
ఆ ప్రాంతంలో మాత్రం మట్టి రోడ్డే. వాన పడితే ఇటు అసలు వెళ్లలేని పరిస్థితి.

కందుకూరు మండలం కోవూరు నుంచి నరిశెట్టివారిపాలెం వెళ్లే 3 కి.మీ.ల మార్గమిది. 100కు పైగా గుంతలు ఉన్నాయి. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి స్వగ్రామం మాచవరం మార్గం ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉంది. అదే తరహాలో కందుకూరు పట్టణం నుంచి నరిశెట్టివారిపాలెం, జిళ్లెళ్లమూడి, విక్కిరాలపేట వరకు ఉన్న రోడ్డు అభివృద్ధికి ఎదురుచూస్తోంది.

గిద్దలూరు నగర పంచాయతీ కాశిరెడ్డినగర్‌లో ఎమ్మెల్యే అన్నా రాంబాబు కార్యాలయం ఉంది. దీనికి సమీపంలోని శ్రీనివాసనగర్‌ రహదారి ఇది. ఇక్కడ ఇప్పటికే 100కు పైగా గృహాలు ఉండటంతో పాటు కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. వర్షం పడిన సమయంలో నీరు నిలిచిపోతుండటంతో అటుగా వెళ్లే చిన్నారులు, వృద్ధులు అవస్థలు చవిచూస్తున్నారు.  

దర్శి శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్‌ స్థానికంగానే ఉంటున్నారు. నిత్యం ఆయనను కలిసేందుకు అనేకమంది ప్రజలు వెళ్తుంటారు. రెండు మార్గాలు ఉండగా ఒకదాని పరిస్థితి ఇలా ఉంది. ఎక్కడికక్కడ గుంతలతో నీళ్లు నిలిచిపోతున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఇంకెలా ఉంటుందో.

చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి క్యాంపు కార్యాలయం రామకృష్ణాపురం గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. దాదాపు పది వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో అనేక రోడ్లు అభివృద్ధికి నోచుకోలేదు. ఓ వీధి ఇలా ఉంది. 


పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్వస్థలం కోనంకిలో
నడిచేందుకు సైతం వీలుకాని రీతిలో అంతర్గత రోడ్డు. 


మార్కాపురం పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవనగర్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,
ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డిల నివాసాల ముందు అద్దంలా ఉన్న రహదారి.


మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి స్వగ్రామమైన కొండేపల్లిలో ప్రధాన రహదారి ఇలా ఉంది.
మంత్రి సురేష్‌ స్వస్థలం గజ్జలకొండలో అంతర్గత, సీసీ రహదారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 


ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారి ఇలా చక్కగా..


ఎంపీ కార్యాలయానికి సమీపంలోనే రాంనగర్‌ రహదారి మధ్యలో గుంతలు చూశారా..
ఇటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కనిగిరి నగర పంచాయతీలో 20 వార్డులు ఉంటే వాటిలో 10 వార్డుల్లో రోడ్ల స్థితి అధ్వానంగా ఉంది. దానికి నిదర్శనం ఇదిగో శంకరవరం మార్గం. 8వ వార్డులో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఉంటున్నారు. అక్కడ సీసీ రోడ్డు చక్కగా  మెరుస్తోంది. ఇదే తరహాలో అనేక కాలనీల్లో మార్గాలు మారాల్సి ఉంది.  

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని