logo

AP News: పెళ్లాడతా లేదంటే ప్రాణం విడుస్తా.. ఇల్లు విడిచి వెళ్లిన బీటెక్‌ విద్యార్థిని

ఆమె ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టినప్పటికీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అలాగైతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు

Updated : 20 Dec 2021 08:47 IST

సురక్షితంగా అప్పగించిన పోలీసులు


విద్యార్థిని కోసం నగర వీధుల్లో గాలిస్తున్న మద్దిపాడు ఎస్సై శ్రీరామ్‌, ఒంగోలు పోలీసు సిబ్బంది

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆమె ఇంజినీరింగ్‌ చదువుతోంది. ఓ యువకుడితో ప్రేమలో పడింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టినప్పటికీ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అలాగైతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ చెప్పి ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. యువతి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతే అద్దంకి నుంచి పోలీసు వేట మొదలైంది. విద్యార్థిని అద్దంకిలో ఆర్టీసీ బస్సు ఎక్కినట్టు గుర్తించి మద్దిపాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని సూచించారు. యువతి వద్దనున్న చరవాణి సంకేతాల ఆధారంగా అప్పటికే బస్సు మద్దిపాడు దాటి ఒంగోలు దిశగా ప్రయాణిస్తున్నట్టు తెలుసుకుని ఒంగోలు పోలీసులనూ అప్రమత్తం చేశారు. ఒకటో పట్టణ సీఐ కె.వి.సుభాషిణి నగరంలోని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలకు ఆదేశించారు. మద్దిపాడు ఎస్సై శ్రీరామ్‌ నగరానికి చేరుకుని జిల్లా పోలీసు కేంద్రంలోని సాంకేతిక బృందం సహాయం తీసుకున్నారు. రెండు గంటల పాటు శ్రమించి చివరికి ఆ యువతిని ఒంగోలు కొత్తపట్నం రోడ్డులో గుర్తించారు. ఆమె కుటుంబీకులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని