AP news: శాస్త్రీయ దృక్పథంతోనే మార్పు
విజేతలకు ధ్రువ పత్రాలు అందజేస్తున్న డీఈవో విజయభాస్కర్, క్విస్ కళాశాల ఛైర్మన్ నాగేశ్వరరావు
ఒంగోలు నగరం, న్యూస్టుడే : విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతోనే జీవన విధానంలో మార్పునకు అవకాశం ఉంటుందని డీఈవో బి.విజయభాస్కర్ అన్నారు. బుధవారం స్థానిక క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలో కౌషల్ రాష్ట్రస్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 325 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోస్టర్ ప్రజంటేషన్లో మహ్మదాపురం జడ్పీ స్కూలు విద్యార్థి బ్లెస్సీ ప్రథమ, బూదవాడ స్కూలు విద్యార్థిని శివాని ద్వితీయ, ఉమామహేశ్వరపురం జడ్పీ స్కూలు విద్యార్థి శ్రీకాంత్ తృతీయ స్థానాలు సాధించారు. అజాదీ కా అమృత్ మహోత్సవ్ పోస్టర్ ప్రజంటేషన్లో మంగమూరు జడ్పీస్కూలుకు చెందిన అఖిల, అద్దంకి జీహెచ్ఎస్ విద్యార్థి సరస్వతి, బేస్తవారపేట జడ్పీస్కూలు విద్యార్థి అబ్దుల్ ఆసిష్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. క్విజ్ పోటీల్లో పంగులూరు జడ్సీ స్కూలు విద్యార్థులకు ప్రథమ, పొదిలి స్కూలు విద్యార్థులకు ద్వితీయ, ముండ్లమూరు మోడల్ స్కూలు విద్యార్థులకు తృతీయ స్థానం లభించింది. విజేతలకు డీఈవో, క్విస్ కళాశాల ఛైర్మన్ నిడమానూరి నాగేశ్వరరావు సర్టిఫికేట్లు అందజేశారు. కోఆర్డినేటర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ విజ్ఞాన మండలి రాష్ట్రశాఖ అధ్యక్షులు శాస్త్రి, క్విస్ కళాశాల ప్రిన్సిపల్ శేషారావు పాల్గొన్నారు.