logo

మొదలు పెట్టాక.. మంజూరు కాలేదంటున్నారు

యడవల్లి జగనన్న కాలనీలో పక్కా గృహాన్ని నిర్మించేందుకు ఆ గ్రామానికి చెందిన బోగెం రంగమ్మకు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా ఇచ్చింది. ఇంటి నిర్మాణం ప్రారంభించమని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె రూ.40 వేలు సొంత సొమ్ము వెచ్చించి బేస్‌మట్టం

Published : 18 Jan 2022 02:39 IST


ప్రభుత్వ పట్టా చూపిస్తున్న లబ్ధిదారులు రంగమ్మ, మద్దయ్య

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: యడవల్లి జగనన్న కాలనీలో పక్కా గృహాన్ని నిర్మించేందుకు ఆ గ్రామానికి చెందిన బోగెం రంగమ్మకు ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా ఇచ్చింది. ఇంటి నిర్మాణం ప్రారంభించమని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె రూ.40 వేలు సొంత సొమ్ము వెచ్చించి బేస్‌మట్టం నిర్మించారు. అయితే బిల్లు మంజూరు చేయమని గృహనిర్మాణశాఖ ఇంజినీర్లను అడిగితే ‘మీ పేరు మ్యాపింగ్‌ కావడం లేదు. పక్కాగృహం మంజూరు కాలేదు.’ అని చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో ఆమె భర్త మద్దయ్యతో కలిసి సోమవారం ఎంపీడీవో ప్రభాకర్‌ శర్మ, తహసీల్దారు వేణుగోపాలరావులకు తన సమస్యను విన్నవించుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు దగ్గర ఉండి తమ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయించారన్నారు. వారి వెంట తెదేపా మండలాధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి, నాయకులు సుబ్బరత్నం, లక్ష్మయ్య, శేషాద్రి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని