logo

30 శాతానికి పైగా ఫిట్‌మెంట్‌కు వినతి

ఉద్యోగుల పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 30 శాతానికి పైగా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఆర్వో శ్రీనివాసరావుకి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఫిట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని అందులో కోరారు. ఇంటి అద్దె

Published : 18 Jan 2022 02:39 IST


డీఆర్వోకి వినతి పత్రం ఇస్తున్న ఆపస్‌ ప్రతినిధులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఉద్యోగుల పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 30 శాతానికి పైగా ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఆర్వో శ్రీనివాసరావుకి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఫిట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని అందులో కోరారు. ఇంటి అద్దె భత్యాన్ని పాత పద్దతిలోనే 12,14.5, 20, 30 శాతం స్లాబ్‌లు కొనసాగించాలన్నారు. పెరిగిన ధరల ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన కరవు భత్యాన్ని రెండున్నరేళ్లుగా ఇవ్వకుండా ఒకేసారి ఇస్తామనడం సహేతుకం కాదని పేర్కొన్నారు. డీఆర్వోను కలసిన వారిలో ఆపస్‌ సంఘం అధ్యక్షుడు కె.మల్లికార్జునరావు, నాయకులు దిలీప్‌చక్రవర్తి, ఫణీంద్రకుమార్‌, శేషారావు, చంద్రశేఖర్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని