logo

‘విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ చెలగాటం’

కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున జనవరి నెల మొత్తం విద్యాలయాలకు సెలవులు ప్రకటించాలని విద్యార్థి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ కోరారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో

Published : 18 Jan 2022 02:39 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నందున జనవరి నెల మొత్తం విద్యాలయాలకు సెలవులు ప్రకటించాలని విద్యార్థి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్‌ కోరారు. ఒంగోలులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యగా విద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తే.. మన రాష్ట్ర విద్యాశాఖ మాత్రం పిల్లల జీవితాలతో ఆడుకుంటోందని ఆరోపించారు. కరోనా వల్ల ఏ విద్యార్థికైనా ప్రాణనష్టం వాటిల్లితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఐకాస నాయకులు కార్తిక్‌, యోహషువా, రాజీవ్‌, అశోక్‌, హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని