logo

19 నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల ఆందోళన

కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు.

Published : 18 Jan 2022 02:39 IST


సమావేశంలో మాట్లాడుతున్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను పీఆర్సీ విషయంలో మోసం చేసిందన్నారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని హామీ ఇచ్ఛి. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. వారిని రెగ్యులర్‌ చేయడంతోపాటు, పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు జి.శ్రీనివాసులు, చీకటి శ్రీనివాసరావు, కాలం సుబ్బారావు, పి.కల్పన, ఎం.వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని