logo

గుంటూరు గిత్తలదే హవా

అన్నంబొట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలో గుంటూరు గిత్తలు తమ సత్తా చాటాయి. గోరంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో సోమవారం సేద్యం విభాగంలో నిర్వహించిన బండ లాగుడు పోటీల్లో గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన

Published : 18 Jan 2022 02:39 IST


బండ లాగుతున్న కోడెలు

పర్చూరు, న్యూస్‌టుడే : అన్నంబొట్లవారిపాలెంలో జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలో గుంటూరు గిత్తలు తమ సత్తా చాటాయి. గోరంట్ల రత్తయ్యచౌదరి ప్రాంగణంలో సోమవారం సేద్యం విభాగంలో నిర్వహించిన బండ లాగుడు పోటీల్లో గుంటూరు జిల్లా చుండూరు మండలం వేటపాలెంకు చెందిన ఎ.శిరీషచౌదరి, శివకృష్ణచౌదరి కోడెలు 5498.07 అడుగులు లాగి ప్రథమ బహుమతిని సాధించాయి. తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బాలాపుర్‌ మండలం నాదర్‌గుల్‌కు చెందిన యేల్చల ప్రసన్నరెడ్డి, ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరుకు చెందిన తనుబొద్ది రవిశంకరరెడ్డిల సంయుక్త జత 5447.07 అడుగులు లాగి ద్వితీయ బహుమతిని, కర్నాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పెట్‌కు చెందిన వంకినేని మురళీధర్‌, సాయిశ్రీధర్‌ల కోడెలు 5100 అడుగులు లాగి తృతీయ స్థానంలో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని