logo

అడవి పెరిగింది!

జాతీయ అటవీ సర్వే(2021) నివేదికల ప్రకారం జిల్లాలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగింది. 2019లో 3303.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా గతయేడాది 3333.68 చ.కి.మీ.కు పెరిగింది. అంటే దాదాపు 29.84 చ.కి.మీ. మేర అధికం. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 17,626

Published : 18 Jan 2022 02:39 IST

 2019 కంటే 29.84 చ.కి.మీ. హెచ్చు


గిద్దలూరు మండలంలోని నల్లమల అటవీప్రాంతం

జాతీయ అటవీ సర్వే(2021) నివేదికల ప్రకారం జిల్లాలో అడవులు, చెట్ల విస్తీర్ణం పెరిగింది. 2019లో 3303.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా గతయేడాది 3333.68 చ.కి.మీ.కు పెరిగింది. అంటే దాదాపు 29.84 చ.కి.మీ. మేర అధికం. జిల్లా భౌగోళిక విస్తీర్ణం 17,626 చ.కి.మీటర్లు. అందులో దట్టమైన అడవులు 254.61, మధ్యస్థ అడవులు 1,802.59, ఓపెన్‌ ఫారెస్ట్‌ 1,276.48 చ.కి.మీ. మేర ఉన్నాయి. గతయేడాది సర్వే ప్రకారం జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో అడవులు 18.91శాతం మాత్రమే విస్తరించి ఉన్నాయి. రెండేళ్లుగా వర్షాలు సకాలంలో కురవడంతో నల్లమల అభయారణ్యంలో పచ్చదనం పెరిగింది. గిద్దలూరు అటవీ డివిజన్, ఒంగోలు సామాజిక అటవీ విభాగం, మార్కాపురం డివిజన్‌లో మొక్కలు విస్తృతంగా నాటడం కూడా కొంత మేర పచ్చదనం వృద్ధికి దోహదపడింది.   - న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని