logo

AP News: గ్రామాన్నే కుదువ పెట్టేసి బ్యాంకులో లోన్‌ తీసుకున్నారు!

గ్రామం మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులు తమ భూమిగా చెప్పుకుంటూ బ్యాంకులో రుణం తీసుకున్నారని మహిళలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఉదంతమిది. పుల్లలచెరువు మండలం త్రిపురవరం రెవెన్యూ పరిధి సిద్ధినపాలెం గ్రామానికి చెందిన మహిళలు పేర్కొన్న వివరాల ప్రకారం.

Updated : 21 Jan 2022 08:32 IST

అధికారులకు సిద్ధినపాలెం మహిళల ఫిర్యాదు


డిప్యూటీ తహసీల్దార్‌కు ఫిర్యాదు అందజేస్తున్న సిద్దినపాలెం గ్రామ మహిళలు

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: గ్రామం మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులు తమ భూమిగా చెప్పుకుంటూ బ్యాంకులో రుణం తీసుకున్నారని మహిళలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఉదంతమిది. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం త్రిపురవరం రెవెన్యూ పరిధి సిద్ధినపాలెం గ్రామానికి చెందిన మహిళలు పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ గ్రామం మొత్తం 296 సర్వే నంబరులో ఉంది. పూర్తి విస్తీర్ణం 8.34 ఎకరాలు. అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెరో నాలుగు ఎకరాల చొప్పున ఆన్‌లైన్‌ చేసేసుకున్నారన్నారు. తమ భూమి అని చెప్పుకుని యర్రగొండపాలెం పీడీసీసీ బ్యాంకులో రుణం కూడా పొందారని తెలిపారు. వారితో పాటు, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గురువారం మండల ఉప తహసీల్దార్‌ కిరణ్‌కు ఫిర్యాదు అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని