logo

త్వరితగతిన రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణ

నిర్ణీత గడువులోపు రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ శాఖ అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, మండల తహసీల్దార్లతో శుక్రవారం వీక్షణ సమావేశం

Published : 22 Jan 2022 04:26 IST

ఒంగోలు గ్రామీణం: నిర్ణీత గడువులోపు రెవెన్యూ దస్త్రాల స్వచ్ఛీకరణను పూర్తి చేయాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ శాఖ అంశాలపై జిల్లాలోని ఆర్డీవోలు, మండల తహసీల్దార్లతో శుక్రవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. 1,058 రెవెన్యూ గ్రామాలకు గాను.. ఇప్పటివరకు 658 గ్రామాల దస్త్రాల స్వచ్ఛీకరణ పూర్తయిందని, మిగిలినవీ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూముల్లోని గృహాల క్రమబద్ధీకరణ; వ్యవసాయేతర భూ మార్పిడి డ్రైవ్‌కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో పులి శ్రీనివాసులు, కలెక్టరేట్‌ ఏవో బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని