logo

ఉద్యోగిని ఆత్మహత్యాయత్నంపై విచారణ

ధాన్యం కొనుగోలు విషయంలో రైతు బెదిరించిన నేపథ్యంలో ఏల్చూరు ఆర్బీకే-2 ఉద్యోగిని కె.ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతంపై శుక్రవారం మండల స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. తహసీల్దారు ఎం.వెంకటశివరామిరెడ్డి,

Published : 22 Jan 2022 04:26 IST

ఏల్చూరులో విచారిస్తున్న మండల స్థాయి అధికారులు

సంతమాగులూరు: ధాన్యం కొనుగోలు విషయంలో రైతు బెదిరించిన నేపథ్యంలో ఏల్చూరు ఆర్బీకే-2 ఉద్యోగిని కె.ప్రసన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఉదంతంపై శుక్రవారం మండల స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. తహసీల్దారు ఎం.వెంకటశివరామిరెడ్డి, ఎంపీడీవో టి.వి.కృష్ణకుమారి, ఏడీఏ, ఏవో, ఎస్‌ఐ తోపాటు అధికారుల బృందం ఏల్చూరులో విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. వివరాలు సేకరించి, నివేదిక తయారు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై రైతు మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివన్నారాయణ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని