logo

‘సమస్యలు పరిష్కరించకపోతే వెళ్లిపోవాలి’

ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే అధికారులు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోవాలని కనిగిరి శాసన సభ్యుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ సమావేశపు కార్యాలయంలో ‘సమస్యలు-పరిష్కారం’ అంశంపై మండలంలోని

Published : 23 Jan 2022 03:31 IST


గుంటుపల్లి గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

పీసీపల్లి, న్యూస్‌టుడే: ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే అధికారులు వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లిపోవాలని కనిగిరి శాసన సభ్యుడు బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక మండల పరిషత్‌ సమావేశపు కార్యాలయంలో ‘సమస్యలు-పరిష్కారం’ అంశంపై మండలంలోని అధికారులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గుంటుపల్లి, పెదఇర్లపాడు, చినవరిమడుగు, పీసీపల్లి, తలకొండపాడు తదితర గ్రామాల ప్రజలు విద్యుత్తు, రెవెన్యూ, పింఛన్లు తదితర సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో ఆయన సంబంధిత అధికారులను పిలిచి వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గుంటుపల్లి సచివాలయ సోషల్‌ వెల్ఫేర్‌ అధికారి వీరప్రతాప్‌ సక్రమంగా విధులు నిర్వహించకుండా, అవినీతికి పాల్పడతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్సై ప్రేమ్‌కుమార్‌ను పిలిచి గ్రామస్థుల వద్ద ఫిర్యాదు తీసుకుని కేసు నమాదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జఫన్య, ఎంపీడీవో కుసుమకుమారి, తహసీల్దార్‌ సింగారావు, జడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని