logo

విస్తృత ప్రచారంతోనే అవగాహన

కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విలేజ్, కొవిడ్, మేనేజ్‌మెంట్‌ కమిటీలు ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దారు ఎం.వెంకటశివరామిరెడ్డి కోరారు. సంతమాగులూరులో శనివారం ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ వ్యాప్తి

Published : 23 Jan 2022 03:31 IST


సంతమాగులూరులో సిబ్బందికి సూచనలు ఇస్తున్న అధికారులు

సంతమాగులూరు: కొవిడ్‌-19 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విలేజ్, కొవిడ్, మేనేజ్‌మెంట్‌ కమిటీలు ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దారు ఎం.వెంకటశివరామిరెడ్డి కోరారు. సంతమాగులూరులో శనివారం ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలు అనుసరించాల్సిన విధానంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎంపీడీవో టి.వి.కృష్ణకుమారి, పీహెచ్‌సీ వైద్యాధికారి ఎం.వి.నారాయణ, ఎస్‌ఐ శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.పర్చూరు : పర్చూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ఉదయం పాఠశాలకు ప్రారంభించగానే విద్యార్థులు ఆరోగ్యం గురించి ఉపాధ్యాయులు ఆరా తీశారు. పాఠశాలలో 1-7 తరగతుల్లో 105 మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 55 మంది విద్యార్థులు జలుబు, దగ్గు, స్వల్ప జ్వరం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించి వారిని వెంటనే ఇంటికి వెళ్లాలని సూచించారు. పిల్లలకు కొవిడ్‌ పరీక్షలు చేయించాలని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని