logo

‘ఉద్యోగులపై ప్రభుత్వ వైఖరి సరికాదు’

పీఆర్సీలో చోటుచేసుకున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ఉండటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల

Published : 23 Jan 2022 03:31 IST


మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు.. చిత్రంలో నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పీఆర్సీలో చోటుచేసుకున్న అన్యాయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరితో ఉండటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. ఒంగోలులోని సుందరయ్య భవన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఒక వైపు ఆందోళనకు సిద్ధపడగా.. అదే సమయంలో వారితో చర్చలు నిర్వహించకుండా మంత్రి మండలిలో జీవోలకు ఆమోదముద్ర వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ చర్య పుండు మీద కారం చల్లినట్టు ఉందన్నారు. ఉద్యోగులు సమ్మెకు పోకుండా నివారించాలని కోరారు. గుడివాడలో క్యాసినో వివాదంపై జుడీషియల్‌ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అక్కడి పరిణామాలపై మంత్రి కొడాలి, తెదేపా నాయకులు సవాళ్లు విసురుకోవడం చూస్తుంటే ఇది రెండు పార్టీల మధ్య వివాదంగా మారినట్టు కనిపిస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలో నెల రోజుల వ్యవధిలో తొమ్మిది మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని.. బాధిత కుటుంబాల గురించి పాలకులకు పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పునాటి ఆంజనేయులు, నాయకులు జీవీ.కొండారెడ్డి, ఆండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని