logo

ఉసురుతీసిన అప్పులు

అప్పుల బాధతో ఓ రైతు ఉసురు తీసుకున్న విషాదమిది. ఈనెల 18న ఆత్మహత్యాయత్నం చేసుకోగా శనివారం ఆయన మృతిచెందారు. సంతమాగులూరు స్టేషన్‌ ఎస్సై శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం..

Published : 23 Jan 2022 03:31 IST

 ఆత్మహత్యాయత్నం చేసిన రైతు మృతి

కొమ్మాలపాడు (సంతమాగులూరు), న్యూస్‌టుడే: అప్పుల బాధతో ఓ రైతు ఉసురు తీసుకున్న విషాదమిది. ఈనెల 18న ఆత్మహత్యాయత్నం చేసుకోగా శనివారం ఆయన మృతిచెందారు. సంతమాగులూరు స్టేషన్‌ ఎస్సై శివన్నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాలపాడు గ్రామానికి చెందిన దుద్దేల రాగయ్య (40) గత మూడేళ్ల నుంచి మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది రెండెకరాల్లో మిరప, ఒక ఎకరంలో పత్తి సాగు చేశారు. అకాల వర్షాలు, చీడపీడలతో పంట దెబ్బతింది. రూ.6 లక్షలకు పైగా అప్పుల పాలయ్యారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రాగయ్య ఈ నెల 18న పొలం వెళ్లి పురుగు మందు తాగారు. సమీపంలో ఉన్న రైతులు గమనించి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. వారు వెంటనే నరసరావుపేట ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి గుంటూరు సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మృతి చెందారు. రాగయ్యకు భార్య రమణమ్మ, ఇద్దరు పిల్లలున్నారు. రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు