logo

నేటి నుంచి గనుల్లో భద్రతా పరీక్షలు

జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి, కనిగిరితో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న సుమారు వంద గ్రానైట్‌ క్వారీల్లో సోమవారం నుంచి ట్రేడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వాసవీ గ్రానైట్స్‌ యజమానులు శిద్దా సురేష్‌ కుమార్‌, శిద్దా సుధీర్‌ కుమార్‌ నిర్వహణ

Published : 24 Jan 2022 05:19 IST

రామతీర్థం ప్రాంతంలోని గ్రానైట్‌ క్వారీలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి, కనిగిరితో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న సుమారు వంద గ్రానైట్‌ క్వారీల్లో సోమవారం నుంచి ట్రేడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. వాసవీ గ్రానైట్స్‌ యజమానులు శిద్దా సురేష్‌ కుమార్‌, శిద్దా సుధీర్‌ కుమార్‌ నిర్వహణ కమిటీ ఛైర్మన్లుగా, గనుల భద్రతా విభాగం ఉప సంచాలకుడు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం నుంచి ఈ నెల 31 వరకు వివిధ రకాల ట్రేడ్‌ పరీక్షలుంటాయి. చీమకుర్తి ప్రాంతంలోని 17 క్వారీలు, గురిజేపల్లి, బల్లికురవ ప్రాంతంలో 11, కనిగిరి వద్ద గల 3 క్వారీల్లో ఇందుకు ఏర్పాట్లు చేశారు. డంపర్‌, టిప్పర్‌, వైర్సా, ఎక్స్‌క్లవేటర్‌ తదితర యంత్రాల నిర్వహణకు సంబంధించిన పరీక్షలను క్వారీల్లో, ఇతర పరీక్షలను రామతీర్థంలోని గ్రానైట్‌ వృత్తి శిక్షణా కేంద్రంలో ఉంటాయి. అనంతరం ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని