logo

తగ్గేదే లేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఒంగోలు నగరంలోని ఎన్జీవో హోంలో జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు

Published : 24 Jan 2022 05:19 IST

25న మూడు వేల మందితో మహాధర్నా

ఉద్యమ సన్నద్ధ సమావేశంలో నాయకులు

మాట్లాడుతున్న ఏపీ ఎన్జీవో నాయకుడు శరత్‌బాబు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఒంగోలు నగరంలోని ఎన్జీవో హోంలో జిల్లాలోని అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు శరత్‌బాబు మాట్లాడారు. రాష్ట్ర పీఆర్సీ సాధన సమితి నిర్ణయం మేరకు దశల వారీగా ప్రకటించిన అన్ని రకాల ఉద్యమ కార్యాచరణను విజయవంతం చేయాలని కోరారు. అధికారుల కమిటీ సిఫార్సులు రద్దు చేయడంతో పాటు, అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గతం చేసి అమలు చేయాలన్నారు. ఐఆర్‌ 27 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలని, కేంద్ర పే కమిటీ స్కేల్స్‌ అమలు చేయొద్దని, రాష్ట్ర పే కమిషన్‌ను యధాతథంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 25న ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద మూడు వేల మందితో మహాధర్నా చేయనున్నట్టు తెలిపారు. 26న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రాలు; 27 నుంచి 30 వరకు రిలే నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పలు సంఘాల నాయకులు విమర్శలు గుప్పించారు. సమావేశంలో జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

​​​​​​​

సమావేశానికి హాజరైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

పెంచకుండా తగ్గింపు తగదు...

ఉద్యోగులతో సంప్రదింపులు చేపట్టకుండా పీఆర్సీ ఉత్తర్వులు ఇచ్చారు. చీకటి జీవోలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. ఐఆర్‌ 27 శాతం ఉంటే పీఆర్సీ 23 శాతం ఇచ్చారు. తక్కువ ఉండటం ఇదే ప్రథమం. గతంతో పోలిస్తే అద్దెలు పెరుగుతున్నాయి. అలాంటిది హెచ్‌ఆర్‌ఏ పెంచాల్సింది పోయి.. తగ్గించడం ఏమిటి? పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీరించాలి. - వై.చిట్టిబాబు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ జిల్లా ఛైర్మన్‌

పాదయాత్ర హామీ నెరవేర్చాలి...

అధికారుల కమిటీ సిఫార్సులు రద్దు చేయడంతో పాటు, అశుతోష్‌ మిశ్రా నివేదికను బహిర్గత పరిచి అమలు చేయాలి. ఐఆర్‌ 27 శాతం కంటే ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. పాత హెచ్‌ఆర్‌ఏ స్లాబులను కొనసాగించాలి. రాష్ట్ర పే కమిషన్‌ యధాతథంగా అమలు చేయాలి. జగన్‌ మోహన్‌ రెడ్డి తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకూ పేస్కేల్స్‌ వర్తింపజేయాలి. - కృష్ణమోహన్‌, ఏపీ ఐకాస అమరావతి జిల్లా ఛైర్మన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు