logo

వీఆర్‌కు సెబ్‌ సీఐ సమీముల్లా!

సెబ్‌ జేడీ టీమ్‌ సీఐ సమీముల్లాను గుంటూరు రేంజ్‌ వీఆర్‌కు పంపినట్టు తెలిసింది. సమీముల్లా పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తూ సీఐగా ఉద్యోగోన్నతి పొందారు. సెబ్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ టీమ్‌ సీఐగా నియమించారు.

Published : 24 Jan 2022 05:19 IST

ఒంగోలు నేరవిభాగం: సెబ్‌ జేడీ టీమ్‌ సీఐ సమీముల్లాను గుంటూరు రేంజ్‌ వీఆర్‌కు పంపినట్టు తెలిసింది. సమీముల్లా పోలీసు శాఖలో ఎస్సైగా పనిచేస్తూ సీఐగా ఉద్యోగోన్నతి పొందారు. సెబ్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ టీమ్‌ సీఐగా నియమించారు. ఒంగోలు కేంద్రంగా పనిచేసిన సమీముల్లా.. విధి నిర్వహణలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై జిల్లా అధికారుల నివేదికలతో పాటు శాఖాపరంగా అంతర్గత విచారణ చేసినట్టు తెలిసింది. ఈ నివేదికల ఆధారంగా సమీముల్లాను మాతృశాఖకు పంపగా.. ఆయన్ను రేంజ్‌ వీఆర్‌కు పంపుతూ డీఐజీ త్రివిక్రమవర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని