logo

ఉద్యోగుల పోరాటానికి ఏఐటీయూసీ మద్దతు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటానికి ఏఐటీయూసీ మద్దతు ఇస్తోందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్‌బాబు తెలిపారు. స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల

Published : 24 Jan 2022 05:19 IST

సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా

ప్రధాన కార్యదర్శి సురేష్‌బాబు, నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన పోరాటానికి ఏఐటీయూసీ మద్దతు ఇస్తోందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్‌బాబు తెలిపారు. స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మద్దతుగా ఈ నెల 29న కలెక్టరేట్‌ వద్ద మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని నిరసన చేపడతామన్నారు. సమావేశంలో కార్యనిర్వాహక కార్యదర్శి యాసిన్‌, నాయకులు సుభాన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు