logo

బయోమెట్రిక్‌ హాజరుతోనే బిల్లుల చెల్లింపు

డైట్‌, కాస్మోటిక్స్‌ బిల్లులను ఆటో డెబిట్‌ విధానం ద్వారా చెల్లించనున్న నేపథ్యంలో బయోమెట్రిక్‌ హాజరు వేసిన విద్యార్థులకు మాత్రమే ఇకపై అందుతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ హర్షవర్ధన్‌ సూచించారు. స్థానిక ప్రగతి భవన్‌లో

Published : 24 Jan 2022 05:19 IST

అధికారులతో సమీక్షిస్తున్న రాష్ట్ర సాంఘిక

సంక్షేమ శాఖ కమిషనర్‌ హర్షవర్ధన్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: డైట్‌, కాస్మోటిక్స్‌ బిల్లులను ఆటో డెబిట్‌ విధానం ద్వారా చెల్లించనున్న నేపథ్యంలో బయోమెట్రిక్‌ హాజరు వేసిన విద్యార్థులకు మాత్రమే ఇకపై అందుతాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌ హర్షవర్ధన్‌ సూచించారు. స్థానిక ప్రగతి భవన్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ మాట్లాడుతూ.. ఆధార్‌ లేని విద్యార్థులకు సమీపంలోని మీ సేవా కేంద్రాల ద్వారా తప్పనిసరిగా నమోదు చేయించాలని ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాల్లో కొవిడ్‌ నిబంధనలను పాటించడంతో పాటు, పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వసతి గృహాల్లో చేరిన విద్యార్థుల సంఖ్య సుమారు 2 వేల వరకు తగ్గిందన్నారు. డ్రాప్‌ అవుట్స్‌ విద్యార్థులను గుర్తించి మళ్లీ చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో స్టడీ సర్కిల్‌ ఏర్పాటు విషయమై ఒంగోలులో సామాజిక పరివర్తన భవనం అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్నట్టు అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో జేసీ కె.కృష్ణవేణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎన్‌.లక్ష్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని