logo

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన సోమవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు ... ఏబీఎం కాంపౌండ్‌లో నివసిస్తున్న నాగులూరి చిన్న ఏడు నెలల క్రితం హైదరాబాద్‌లో బేల్దారీ

Published : 25 Jan 2022 03:28 IST


ఇంటి వద్ద తమ పిల్లలతో దంపతులు చిన్న, కుమారి

పొదిలి, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన సోమవారం జరిగింది. బాధితుల వివరాల మేరకు ... ఏబీఎం కాంపౌండ్‌లో నివసిస్తున్న నాగులూరి చిన్న ఏడు నెలల క్రితం హైదరాబాద్‌లో బేల్దారీ పనికి వెళ్తానని చెప్పి కొత్తపాలెం నారాయణరెడ్డి వద్ద రూ.10 వేలు అప్పుగా తీసుకున్నారు. తదనంతరం చిన్న అనారోగ్యానికి గురికావడంతో ప్రస్తుతం పొదిలి వచ్చి పాత ఇనుము వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల నారాయణరెడ్డి చిన్న వాళ్ల ఇంటికి వచ్చి అసలు, వడ్డీతో కలిపి రూ.30 వేలు అయిందని వెంటనే తీర్చాలని కోరారు. తాను వెంటనే చెల్లించలేనని చెప్పడంతో వారి వద్ద ఉన్న ఆటోను తీసుకెళ్లారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో రూ.2 లక్షల వరకు ఖర్చు కావడం .. ఉన్న ఆటోను తీసుకెళ్లడంతో దంపతులిద్దరూ సోమవారం ఉదయం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికులు పొదిలి సామాజిక వైద్యశాలకు తరలించగా, వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు రిమ్స్‌కు సిఫారసు చేశారు. తమకు ఆర్థిక స్తోమత లేదంటూ వారు ఇంటికొచ్చేశారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. దీనిపై ఎస్సై వై.శ్రీహరిని వివరణ కోరగా విషయం తెలిసిందని, బాధితుల నుంచి సమాచారం సేకరించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని