logo

స్థానికేతరులు వేట సాగిస్తే చర్యలు తప్పవు

గుండ్లకమ్మ జలాశయం పరిధిలో స్థానికేతరులు చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఆ శాఖ చీరాల సహాయ సంచాలకులు వీవీ రంగనాథబాబు, సహాయ ఇన్‌స్పెక్టర్‌ జి.రాము... విద్యుత్తు, పోలీసు, అటవీ, రెవెన్యూ

Published : 25 Jan 2022 03:28 IST


మణికేశ్వరంలో స్థానికేతరులతో మాట్లాడుతున్న మత్స్యశాఖ అధికారులు

అద్దంకి, మేదరమెట్ల - న్యూస్‌టుడే: గుండ్లకమ్మ జలాశయం పరిధిలో స్థానికేతరులు చేపల వేట సాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ అధికారులు హెచ్చరించారు. ఆ శాఖ చీరాల సహాయ సంచాలకులు వీవీ రంగనాథబాబు, సహాయ ఇన్‌స్పెక్టర్‌ జి.రాము... విద్యుత్తు, పోలీసు, అటవీ, రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం పలు గ్రామాల్లో పర్యటించారు. మణికేశ్వరం, అనమనమూరు సమీపంలో అనధికారికంగా చేపల వేట సాగిస్తున్న కైకలూరు (కృష్ణాజిల్లా), విజయలక్ష్మీపురం (చీరాల), చినగంజాం ప్రాంతాలకు చెందిన పది కుటుంబాలను గుర్తించారు. వారి నుంచి చేపల బుట్టలు స్వాధీనం చేసుకుని... తక్షణం ఖాళీ చేయకపోతే క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. జలాశయం ముంపు పరిధిలో ఉన్న అనమనమూరులో సుమారు 111 ఎకరాల్లో విస్తరించిన చేపల చెరువులను పరిశీలించారు. అక్కడున్న అయిదు కుటుంబాల వారితో మాట్లాడి... ఇనుప పడవను స్వాధీనం చేసుకున్నారు. మరోమారు స్థానికేతరులు వేట సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలనాంశాలపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్లు రంగనాథబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని