logo

సేద్యంలో ఆధునిక పద్ధతులతో మేలు

సేద్యంలో ఆధునిక విధానాలు పాటిస్తూ రైతులు పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు... అధిక దిగుబడులు సాధించాలని జేడీఏ ఎస్‌.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మార్టూరు, పర్చూరు, అద్దంకి సబ్‌ డివిజన్ల స్థాయి సదస్సును మార్టూరులో సోమవారం నిర్వహించారు.

Published : 25 Jan 2022 03:28 IST


సమావేశంలో మాట్లాడుతున్న జేడీఏ శ్రీనివాసరావు, వేదికపై ఏడీఏలు, ఏవోలు

మార్టూరు, న్యూస్‌టుడే: సేద్యంలో ఆధునిక విధానాలు పాటిస్తూ రైతులు పెట్టుబడి భారం తగ్గించుకోవడంతో పాటు... అధిక దిగుబడులు సాధించాలని జేడీఏ ఎస్‌.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మార్టూరు, పర్చూరు, అద్దంకి సబ్‌ డివిజన్ల స్థాయి సదస్సును మార్టూరులో సోమవారం నిర్వహించారు. వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రాయితీపై ప్రభుత్వం పరికరాలు పంపిణీ చేస్తోందన్నారు. ప్రతి సచివాలయం పరిధిలో అయిదుగురు రైతులు బృందంగా ఏర్పడి... 40 శాతం రాయితీపై వీటిని పొందవచ్చన్నారు. ఈ-పంట నమోదు చేసుకుంటేనే... పంట కొనుగోళ్లకు అవకాశం ఉంటుందన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రాయితీపై అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏలు బి.ఎఫ్రాయిమ్‌, ఎన్‌.మోహనరావు, కె.ధనరాజ్‌, మార్టూరు ఏవో వి.కిరణ్‌కుమార్‌, బల్లికురవ, సంతమాగులూరు, పంగులూరు, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, యద్దనపూడి, అద్దంకి, ముండ్లమూరు, కొరిశపాడు, తాళ్లూరు, మద్దిపాడు మండలాల ఏవోలు, సీహెచ్‌సీలు, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని