logo

పంచాయతీకి అప్పగించాలని తీర్మానం

సి.ఎస్‌.పురంలోని డీజీపేట రహదారిలో రామాలయం దగ్గర ఉన్న నీటిశుద్ధి పథకాన్ని పంచాయతీకి అప్పగించాలని సర్పంచి ఎస్‌.పద్మావతి, ఉప సర్పంచి పి.నరసయ్య డిమాండ్‌ చేశారు. సర్పంచి నివాసంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వైకాపా

Published : 25 Jan 2022 03:28 IST


మాట్లాడుతున్న సర్పంచి పద్మావతి, చిత్రంలో వార్డు సభ్యులు, తెదేపా నాయకులు

సి.ఎస్‌.పురం, న్యూస్‌టుడే: సి.ఎస్‌.పురంలోని డీజీపేట రహదారిలో రామాలయం దగ్గర ఉన్న నీటిశుద్ధి పథకాన్ని పంచాయతీకి అప్పగించాలని సర్పంచి ఎస్‌.పద్మావతి, ఉప సర్పంచి పి.నరసయ్య డిమాండ్‌ చేశారు. సర్పంచి నివాసంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వైకాపా నాయకుడు పంచాయతీ స్థలంలో నిర్మించిన నీటిశుద్ధి పథకాన్ని పంచాయతీకి అప్పగించేలా తీర్మానం చేసినట్లు వివరించారు. పంచాయతీ కార్యదర్శి అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా వ్యవహరిస్తూ సర్పంచి, పాలకవర్గానికి సహకరించడంలేదని ఆరోపించారు. నీటిశుద్ధి పథకం విద్యుత్తు మీటరును వైకాపా నాయకుడి పేరుపై కార్యదర్శి అనుమతించారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి పథకాన్ని పంచాయతీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆర్‌.షాను, బి.కళావతి, బి.బాలయ్య, తెదేపా నాయకులు ఎం.శ్రీనివాసులు, పి.రవిచంద్ర, బి.శ్రీనివాసులు, జె.లక్ష్మీదేవి, బి.యాకోబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని