logo

సమాజంలోని రుగ్మతలను తెలిపేదే మట్టిపాదం

కష్టాలు , బాధలను అధిగమించి ఎదగడంతో పాటు, సహజమైన మనసుతో సమాజంలోని రుగ్మతలను తెలియజేసేదే మట్టిపాదం పుస్తకం ఉద్ధేశ్యమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. వలేటివారిపాలెం కొండసముద్రం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని, కవయిత్రి

Published : 25 Jan 2022 03:28 IST


పుస్తకావిష్కరణ చేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఉపాధ్యాయులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: కష్టాలు , బాధలను అధిగమించి ఎదగడంతో పాటు, సహజమైన మనసుతో సమాజంలోని రుగ్మతలను తెలియజేసేదే మట్టిపాదం పుస్తకం ఉద్ధేశ్యమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. వలేటివారిపాలెం కొండసముద్రం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని, కవయిత్రి జి.ఈశ్వరీ భూషణం రచించిన మట్టిపాదం పుస్తకావిష్కరణ కార్యక్రమం బీటీఏ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో ఉండే సామాజిక స్పృహను తట్టి లేపేలా ఉందన్నారు. బీటీఏ నాయకుడు బండిగోవిందయ్య మాట్లాడుతూ జాషువా సాహిత్యాన్ని పుణికిపుచ్చుకుని ఈశ్వరీ భూషణం రచించిన పుస్తకాన్ని అందరూ చదవాల్సిన అవసరం ఉందన్నారు. బాలుర, బాలికోన్నత పాఠశాల హెచ్‌ఎంలు డి.అనూరాధ, ద్వారకారాణి, ఉపాధ్యాయులు శ్యామ్‌ప్రసాద్‌, హజరత్తయ్య, కృష్ణయ్య, కె.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

మురిగిన గుడ్ల పంపిణీపై చర్యలేవి..?
ఉలవపాడు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షకులు ఎందుకు తనిఖీ చేయడం లేదంటూ ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ మస్తానమ్మ అధ్యక్షతన జరిగింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో కోడి గుడ్లు మురిగిపోవడాన్ని బద్దిపూడి సర్పంచి అనిల్‌రెడ్డి ప్రస్తావించారు. సీడీపీవో మాధవీలత సమాధానమిస్తూ విచారణ చేస్తామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మురిగిన గుడ్లు పంపిణీ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోరారు. చిన్నారులకు సకాలంలో గుడ్లు పంపిణీ చేయడంలో ఇబ్బంది ఏంటని నిలదీశారు. అనంతరం వేటకు వెళ్లే మత్స్యకారులకు విరామ సమయానికి సంబంధించిన పరిహారం అందించాలని తీర్మానం చేశారు. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. పేదలకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెంచమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు అరుణ, ఏఈ కోటేశ్వరరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని