logo

‘ఆక్రమిత భూములను పోర్టుకు కేటాయించాలి’

గుడ్లూరు మండలం చేవూరు పంచాయతీ పరిధిలోని చెరువు పోరంబోకు, అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి కె.అరుణ నివాశంలో సోమవారం

Published : 25 Jan 2022 03:28 IST


సమావేశంలో మాట్లాడుతున్న హేతువాద సంఘం నాయకులు

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: గుడ్లూరు మండలం చేవూరు పంచాయతీ పరిధిలోని చెరువు పోరంబోకు, అటవీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నార్నె వెంకటసుబ్బయ్య డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి కె.అరుణ నివాశంలో సోమవారం హేతువాద సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేనంబర్‌ 879లో 5 ఎకరాలు ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం చెరువు భూములుగా, 883లో 3 ఎకరాలు అటవీ భూములను రామధూతగా అవతారమెత్తిన మార్తాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆక్రమించుకుని ఆశ్రమం నిర్మించారని అన్నారు. ప్రభుత్వ భూములని తెలిసినా ఇన్నేళ్లు కొంతమంది అధికారులు ఆయన్ను కాపాడుతూ వచ్చారని విమర్శించారు. ఈ మేరకు తాము లోకాయుక్తను ఆశ్రయించగా గతేడాది మే నెలలో జిల్లా అధికారులకు ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. ఆరు నెలలు గడిచినా నేటికీ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కోర్టు ఉత్తర్వులు అమలుచేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని హెచ్చరించారు. కె.అరుణ మాట్లాడుతూ.. బాబాల పేరుతో కొందరు అత్యాచారాలు, కుంభకోణాలకు పాల్పతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రామధూత ఆక్రమించుకున్న భూములను రామాయపట్నం పోర్టుకు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో హేతువాద సంఘం జిల్లా అధ్యక్షుడు కాలేషాబేగ్‌, ఉపాధ్యక్షుడు మాచెర్ల రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని