logo

వాహన చక్రంలో చీర చిక్కుకుని మృతి

ద్విచక్ర వాహనం వెనుక కూర్చొని వస్తున్న ఓ మహిళ చీర చక్రంలో ఇరుక్కుని రోడ్డుపై పడటంతో ఆమె మృతిచెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కురిచేడుకు చెందిన అచ్యుతన్న సీతామహాలక్ష్మి గత ముప్పై ఏళ్లుగా పొట్లపాడులో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు.

Updated : 25 Jan 2022 06:26 IST


సీతామహాలక్ష్మి మృతదేహం 

కురిచేడు: ద్విచక్ర వాహనం వెనుక కూర్చొని వస్తున్న ఓ మహిళ చీర చక్రంలో ఇరుక్కుని రోడ్డుపై పడటంతో ఆమె మృతిచెందారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కురిచేడుకు చెందిన అచ్యుతన్న సీతామహాలక్ష్మి గత ముప్పై ఏళ్లుగా పొట్లపాడులో అంగన్‌వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఎప్పుటి లానే పొట్లపాడుకు వెళ్లిన సీతామహాలక్ష్మి(55) తిరిగి కురిచేడుకు బయలుదేరారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, లాలాబావి చెట్ల సమీపంలో ఆమె చీర చక్రంలో ఇరుక్కోవడంతో రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా, మార్గం మధ్యలోని వినుకొండ సమీపంలో మృతి చెందారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని