logo

ప్రజా సమస్యలకు స్పందించాలి

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి స్పందించాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌ నుంచి సోమవారం ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బాధితుల

Published : 25 Jan 2022 03:28 IST


ఫోన్‌ ద్వారా సమస్యలు తెలుసుకుంటున్న జేసీ వెంకట మురళి..
చిత్రంలో జేసీ కృష్ణవేణి, డీఆర్వో శ్రీనివాసులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి స్పందించాలని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌ నుంచి సోమవారం ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బాధితుల నుంచి వచ్చిన సమస్యలను జేసీ వెంకట మురళి అడిగి తెలుసుకుని పరిష్కారానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ కె.కృష్ణవేణి, డీఆర్వో పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. 
* కొమరోలు మండలం రెడ్డిచర్లలో ఎస్సీలకు చెందిన భూములను కొందరు ఆక్రమించడంతో పాటు, వాటిలో కాలువలు తవ్వారని పుల్లయ్య అనే వ్యక్తి జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఫిర్యాదును న్యాయసేవాధికార సంస్థ, ఎస్పీకి పంపిస్తామని జేసీ సమాధానమిచ్చారు. 
* ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేశామని.. అందుకుగాను ఇంతవరకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని పెద్దారవీడు గ్రామానికి చెందిన ఆంజనేయరెడ్డి జేసీకి దృష్టికి తీసుకొచ్చారు. బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకు ఆయన సూచించారు. 
* చీరాల మండలం తోటవారిపల్లెలో 12.90 ఎకరాల శ్మశాన స్థలం ఉండగా.. అందులో చాలా వరకు ఆక్రమణలకు గురైందని గ్రామానికి చెందిన వెంకటరావు జేసీకి ఫిర్యాదు చేశారు.
* కొండపి మండలం పెట్లూరు గ్రామం మధ్యలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. సచివాలయం, పాఠశాల పరిసర ప్రాంతాల్లోనే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని జేసీకి వివరించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని