logo

కొత్త విధానం భారం.. పాతే ప్రయోజనం

‘నూతన ప్రతిపాదన టారిఫ్‌ అమలుతో తక్కువ యూనిట్లు వినియోగించుకునే వారికి ఎక్కువ; ఎక్కువ యూనిట్లు వినియోగించుకునే వారికి తక్కువ బిల్లులొచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న స్లాబులనే కొనసాగించాలి...’ అని కోరుతూ ఎక్కువ

Published : 25 Jan 2022 03:28 IST

 ప్రజాభిప్రాయ సేకరణలో వినియోగదారులు


సమావేశంలో పాల్గొన్న విద్యుత్తు శాఖ ఎస్‌ఈ సత్యనారాయణ, అధికారులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నూతన ప్రతిపాదన టారిఫ్‌ అమలుతో తక్కువ యూనిట్లు వినియోగించుకునే వారికి ఎక్కువ; ఎక్కువ యూనిట్లు వినియోగించుకునే వారికి తక్కువ బిల్లులొచ్చేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న స్లాబులనే కొనసాగించాలి...’ అని కోరుతూ ఎక్కువ మంది వినియోగదారులు ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి కమిషన్‌కు విన్నవించారు. ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై ఒంగోలులోని విద్యుత్తు భవన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. తొలిరోజైన సోమవారం ఇద్దరు వినియోగదారులు తమ సూచనలను వీక్షణ సమావేశం ద్వారా కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 0-30 యూనిట్లు ఒక స్లాబ్, ఆ పైన స్లాబుకు అదనంగా పెంచడం వలన చిన్న వినియోగదారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ మేరకు పాత స్లాబునే యథావిధిగా కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్తు శాఖ ఎస్‌ఈ కేవీజీ.సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాసులు, కరీం, వేణుగోపాల్‌రెడ్డి, ఉషారాణి, ఎస్‌ఏవో సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని