logo

చదువులు భారమంటూ అదృశ్యం

పాఠశాలలో ఉపాధ్యాయులు హోంవర్క్‌ (ఇంటి పని) ఎక్కువ ఇస్తున్నారంటూ ఓ విద్యార్థిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం సోమవారం కలకలం రేపింది. మధ్యాహ్నానికి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలికా దినోత్సవం రోజున చోటుచేసుకున్న

Published : 25 Jan 2022 03:28 IST


బస్సులో బాలికతో మాట్లాడుతున్న ఎస్సై మల్లికార్జున

పాఠశాలలో ఉపాధ్యాయులు హోంవర్క్‌ (ఇంటి పని) ఎక్కువ ఇస్తున్నారంటూ ఓ విద్యార్థిని ఇంట్లో నుంచి బయటికి వెళ్లడం సోమవారం కలకలం రేపింది. మధ్యాహ్నానికి ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలికా దినోత్సవం రోజున చోటుచేసుకున్న ఈ ఉదంతం కందుకూరు డివిజన్‌ పోలీసులను కొద్దిసేపు పరుగులు పెట్టించింది. సీఐ శ్రీరామ్‌ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కందుకూరు పట్టణ పరిధిలోని వెంకటాద్రిపాలేనికి చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం నిద్ర లేచి బ్యాగ్‌లో దుస్తులు ఉంచుకుని బాలిక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. పాఠశాలకు వెళ్లకపోవడం.. ఇంటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. పట్టణ, గ్రామీణ ఎస్సైలు జీవీ.చౌదరి, కిషోర్‌బాబు వెంటనే స్పందించారు. పట్టణంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్, ఆటో స్టాండ్, పాఠశాలల వద్ద గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో అందరిలోనూ ఆందోళన పెరిగింది. చివరికి మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో ఓ వ్యక్తి కందుకూరు నుంచి కావలి వెళ్లే బస్సులో బాలిక ఉన్నట్టు తెట్టు వద్ద తాను చూశానని ఫోన్‌ ద్వారా పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న గుడ్లూరు ఎస్సై మల్లికార్జున.. బస్సును అనుసరించి చేవూరు  మద్దూరుపాడు వద్ద నిలిపి తనిఖీ చేశారు. బాలికను గుర్తించి గుడ్లూరు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తల్లిదండ్రులను అక్కడికి పిలిపించి మాట్లాడారు. పాఠశాలలో హోంవర్క్‌(ఇంటిపని) ఎక్కువగా ఇస్తుండటంతో ఒత్తిడి భరించలేక.. కావలిలో ఉండే అత్తమ్మ ఇంటికి వెళ్తున్నట్టు బాలిక వారికి తెలిపింది. - న్యూస్‌టుడే, గుడ్లూరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని