logo

పిడికిలి బిగించి.. పీఆర్సీపై ఉద్యమించి..

గిద్దలూరు పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు డా.బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎన్‌జీవో సంఘం స్థానిక అధ్యక్షుడు టి.నరేష్‌, ఏపీజీఏ అధ్యక్షుడు వై.పి.రంగయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రవీంద్రనాథరెడ్డి, యూటీఎఫ్‌ సంఘం

Published : 27 Jan 2022 06:24 IST


పొదిలి : అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ...

పీఆర్సీ రద్దు చేసే వరకూ వెన్నుచూపేది లేదని ఉద్యోగ సంఘాలు నినదిస్తున్నాయి. పిడికిలి బిగించి పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉద్యోగులు తమ తమ నిరసనలు కొనసాగించారు.

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే : గిద్దలూరు పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు డా.బీఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఎన్‌జీవో సంఘం స్థానిక అధ్యక్షుడు టి.నరేష్‌, ఏపీజీఏ అధ్యక్షుడు వై.పి.రంగయ్య, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి.రవీంద్రనాథరెడ్డి, యూటీఎఫ్‌ సంఘం నాయకుడు రంగారెడ్డి, ఏపీటీఎఫ్‌ నాయకుడు యల్లా శ్రీనివాసులు, ఆర్టీసీ సంఘం నాయకులు చక్రపాణి యాదవ్‌, పగిడి రమేష్‌బాబు రెడ్డి పాల్గొన్నారు.

కంభం: ఉపాధ్యాయ, ఉద్యోగులు స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి జూనియర్‌ కళాశాల వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐకాస ఛైర్మన్‌ రాధాకృష్ణ, నాయకులు నిరంజన్‌కుమార్‌, పింఛనర్ల సంఘం కార్యదర్శి ఇబ్రహీం, మల్లికార్జున, ఎన్‌జీవో నాయకులు, ఉపాధ్యాయులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

కంభం : నినదిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు

మార్కాపురం పట్టణం: పట్టణంలోని కోర్టు కూడలిలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి బుధవారం ఐకాస నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఐకాస నాయకులు ఓ.వీరారెడ్డి , నాగేంద్రరెడ్డి, చెంచిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఝాన్సీపాల్‌, శ్రీరాములు, రవిచంద్ర, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

దర్శి : ఎంపీీడీవో కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఏపీీటీఎఫ్‌ (257) జిల్లా అధ్యక్షులు కీర్తి, యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, నాయకులు చక్రధర్‌, కృష్ణ, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సీీపీీఎస్‌ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పెద్దదోర్నాల: యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అంబేడ్కర్‌ చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. మండల యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఎమ్‌.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు వర్ధన్‌, అధ్యక్షురాలు రమణమ్మ, నాయకులు సుధాకర్‌రావు, రామకృష్ణనాయక్‌, కాశీరాములు, వెంకయ్య, కిషోర్‌ పాల్గొన్నారు. తాళ్లూరు : ఉపాధ్యాయులు, ఉద్యోగులు గ్రామ శివారునున్న అంబేడ్కర్‌ విగ్రహం వరకూ ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. పొదిలి: ఏబీఎం కాంపౌండ్‌ లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీవో, ఉపాధ్యాయ సంఘాలు, పింఛనర్ల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు ఎన్‌.శ్రీనివాసులరెడ్డి, పి.రమణారెడ్డి, అబ్దుల్‌హై, ఎ.బాదుల్లా, రఫీ, నాగూర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.


మార్కాపురం పట్టణం: అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఉద్యోగులు

పెద్దదోర్నాల : అంబేడ్కర్‌ చిత్రపటానికి వినతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని