logo

కందుకూరు..నెల్లూరులో కలపొద్దు

జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును 45 కి.మీ దూరంలో ఉన్న ఒంగోలులో కాకుండా.. 120 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం దారుణమని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్జీవో గృహంలో అఖిలపక్షం సమావేశం బుధవారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని

Published : 27 Jan 2022 06:24 IST


కందుకూరు: చేతులెత్తి ఐక్యత చాటుతున్న అఖిలపక్షం నాయకులు

కరదుకూరు పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరును 45 కి.మీ దూరంలో ఉన్న ఒంగోలులో కాకుండా.. 120 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం దారుణమని అఖిలపక్షం నాయకులు విమర్శించారు. స్థానిక ఎన్జీవో గృహంలో అఖిలపక్షం సమావేశం బుధవారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇందుకు గాను ఈ నెల 31న సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

మార్కాపురం.. ఆమోదయోగ్యం: ఒంగోలు గ్రామీణం: అసంబద్ధ విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పెంపు ప్రక్రియ చేపట్టిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ విమర్శించారు. గిద్దలూరు నుంచి ఒంగోలుకు రావాలంటే 150 కి.మీ దూరం ఉంటుందని.. అదేవిధంగా జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడంతో ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. w కనిగిరిని రెవెన్యూ డివిజన్‌తో పాటు.. పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంను ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తే అందరికీ ఆమోద యోగ్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. w పశ్చిమ ప్రాంతాన్ని నూతన జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని