logo

మహనీయుల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి కృషి

మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌, నేతాజీ తదితర దేశ నాయకుల త్యాగాల స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి వైపు దూసుకెళ్లేలా కృషి చేస్తున్నామని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సంయుక్త కలెక్టర్‌ వెంకట మురళి జాతీయ జెండా

Published : 27 Jan 2022 06:24 IST


గౌరవ వందనం చేస్తున్న సంయుక్త కలెక్టర్‌ వెంకట మురళి, జేసీ కృష్ణవేణి, డీఆర్వో శ్రీనివాసులు

 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేడ్కర్‌, నేతాజీ తదితర దేశ నాయకుల త్యాగాల స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి వైపు దూసుకెళ్లేలా కృషి చేస్తున్నామని సంయుక్త కలెక్టర్‌ జె.వెంకట మురళి తెలిపారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం సంయుక్త కలెక్టర్‌ వెంకట మురళి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి తరం పిల్లలు, యువతరానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం హక్కుల గురించి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. శతాబ్దాలుగా విదేశీ పాలన కింద బానిసలుగా ఉన్న భారతదేశానికి స్వాతంత్య్రం సాధించి పెట్టిన మహనీయులను నేటి సమాజం గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ కె.కృష్ణవేణి, డీఆర్వో పులి శ్రీనివాసులు, డీపీవో జీవీ.నారాయణరెడ్డి, డీఎస్వో సురేష్‌, జేడీఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని