logo

మొక్కల పంపిణీ

ఇంటి ఆవరణలో ఔషధ మొక్కలు పెంచుకోవాలని ఎంపీడీవో డి.విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జీవ వైవిధ్య మండలి వారి సౌజన్యంతో మండల పరిషత్‌ ఆవరణలో ఒక్కొక్కరికీ 15 మొక్కలు చొప్పున బుధవారం పంపిణీ చేశారు. జామ, మామిడి, కరివేపాకు, ఉసిరి, దానమ్మ, నిమ్మ, సీతాఫలం త

Published : 27 Jan 2022 06:36 IST


మొక్కలు అందజేస్తున్న ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు

చినగంజాం: ఇంటి ఆవరణలో ఔషధ మొక్కలు పెంచుకోవాలని ఎంపీడీవో డి.విజయలక్ష్మి పేర్కొన్నారు. గుంటూరు జీవ వైవిధ్య మండలి వారి సౌజన్యంతో మండల పరిషత్‌ ఆవరణలో ఒక్కొక్కరికీ 15 మొక్కలు చొప్పున బుధవారం పంపిణీ చేశారు. జామ, మామిడి, కరివేపాకు, ఉసిరి, దానమ్మ, నిమ్మ, సీతాఫలం తదితర మొక్కలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి, ఉప ఎంపీపీ టి.ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి, మండల కోఆప్షన్‌ సభ్యుడు షేక్‌ మహమ్మద్‌, మోటుపల్లి సర్పంచి సాంబశివరావు, ప్రొటెక్ట్‌ సంస్థ కార్యదర్శి చంద్రారెడ్డి, ఏఈ దాస్‌, జయరాజ్‌, కోదండరామిరెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని