logo

విస్తీర్ణంమనమే పెద్దలం

 రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రకారం.. 38 మండలాలు, 8 శాసనసభ నియోజకవర్గ స్థానాలు.. మొత్తం 14,322 చ.కి.మీ విస్తీర్ణంతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలన్నింటిలో ప్రకాశమే అతి పెద్దదిగా ఆవిర్భవించనుంది

Published : 27 Jan 2022 06:44 IST

 14,322 చ.కి.మీ.. 22.88 లక్షల జనాభా

 రెవెన్యూ డివిజన్లుగా ఒంగోలు, మార్కాపురం, పొదిలి

ఈనాడు డిజిటల్, ఒంగోలు:  రాష్ట్రంలో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో పాటు ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఇందులో పొందుపరిచిన ప్రకారం.. 38 మండలాలు, 8 శాసనసభ నియోజకవర్గ స్థానాలు.. మొత్తం 14,322 చ.కి.మీ విస్తీర్ణంతో కొత్తగా ఏర్పాటు కానున్న జిల్లాలన్నింటిలో ప్రకాశమే అతి పెద్దదిగా ఆవిర్భవించనుంది. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం 22.88 లక్షలుగా ఉండనుంది. ఒంగోలు, మార్కాపురం, పొదిలి రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కానుంది. గతంలో 56 మండలాలు ఉండగా.. కొత్త జిల్లాలో 38 మాత్రమే ఉంటాయి. మిగిలిన 18 మండలాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు బాపట్ల(చీరాల, అద్దంకి, పర్చూరు), నెల్లూరు(కందుకూరు) జిల్లాల్లో విలీనం అవుతాయి.
 వినిపిస్తున్న నిరసన గళాలు...: జిల్లా విభజన.. రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మార్కాపురం, నల్లమల జిల్లాగా ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రకాశం వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడే వెనకబడిన ప్రాంతం అయిన మార్కాపురానికి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఇందుకుగాను మార్కాపురం జిల్లా సాధన ఐక్యవేదిక, సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలూ చేస్తున్నారు. 


 

 కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడంపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. 
 అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడం పైనా అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే దూరాభారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా...
 మార్కాపురం రెవెన్యూ డివిజన్‌: మొత్తం మండలాలు 13(మార్కాపురం, గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు).. ః తర్లుపాడు మండలం ఇప్పటి వరకు కందుకూరు డివిజన్‌లో ఉంది.
 ఒంగోలు రెవెన్యూ డివిజన్‌: మొత్తం మండలాలు 12(ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు, మర్రిపూడి, జరుగుమల్లి, కొండపి, పొన్నలూరు, సింగరాయకొండ). ః ఇందులో మర్రిపూడి, కొండపి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ మండలాలు ఇప్పటి వరకు కందుకూరు డివిజన్‌లో ఉన్నాయి.
 పొదిలి రెవెన్యూ డివిజన్‌: మొత్తం మండలాలు 13(పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్‌పురం, పావ΄రు, కొనకనమిట్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లవ΄రు, తాళ్లూరు). 
 ఇందులో అన్ని మండలాలు కందుకూరు డివిజన్‌ పరిధిలోనే ఉండేవి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు