logo

యువకుడి బలవన్మరణం

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేదని, అప్పులు పెరిగాయని, ఉద్యోగం దొరకడం లేదనే కారణాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు దళిత కాలనీలో గురువారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా

Updated : 28 Jan 2022 06:32 IST

మృతదేహాన్ని తరలిస్తున్న ఆటోకు అడ్డుపడుతున్న కుటుంబ సభ్యులు, బంధువులు

జరుగుమల్లి: కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేదని, అప్పులు పెరిగాయని, ఉద్యోగం దొరకడం లేదనే కారణాలతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జరుగుమల్లి మండలం వావిలేటిపాడు దళిత కాలనీలో గురువారం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన మునిపల్లి రాజేంద్ర (25) ఎంబీఏ వరకు చదువుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. గత సంవత్సరం కరోనా సోకడంతో వైద్యం కోసం కుటుంబ సభ్యులు రూ.2 లక్షల అప్పు చేశారు. ఉద్యోగం రాకపోవడం, అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోతున్నాడు. ఈ పరిస్థితిలో తండ్రి లాజర్‌ వ్వవసాయ పనుల కోసం వావిలేటిపాడులో ఉన్న తన పెద్ద కుమార్తె శాంతమ్మ వద్దకు వచ్చారు. ఇక్కడే ఉంటూ అరక పనులు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం రాజేంద్ర కూడా తండ్రి వద్దకు వచ్చాడు. వ్యవసాయ పనులు చేస్తున్నాడు. గురువారం వేకువ జామున బయటకు వెళ్లి ఊరి చివర ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు, బంధువులు కాలనీలో విచారించారు. ఇంతలో బావి వద్ద ఉన్న చెప్పులు చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. శవపరీక్ష కోసం తరలిస్తుండగా కాలనీ వాసులు, బంధువులు అడ్డుకున్నారు. సీఐ లక్ష్మణ్‌, ఎస్సై నాయబ్‌ రసూల్‌ బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని