logo

67 వేల మందికి ‘జగనన్న తోడు’

జగనన్న తోడు పథకం కింద జిల్లాలో 67 వేల మందికి రుణం మంజూరు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సంయుక్త కలెక్టర్‌ కె.కృష్ణవేణి సూచించారు. జగనన్న తోడు పథకం అమలుపై ఒంగోలులోని ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో

Updated : 29 Jan 2022 05:28 IST

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సంయుక్త కలెక్టర్‌ కృష్ణవేణి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న తోడు పథకం కింద జిల్లాలో 67 వేల మందికి రుణం మంజూరు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని సంయుక్త కలెక్టర్‌ కె.కృష్ణవేణి సూచించారు. జగనన్న తోడు పథకం అమలుపై ఒంగోలులోని ప్రకాశం భవన్‌లోని ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో 48,435 మందికి; పట్టణ ప్రాంతాల్లో 19,412 మందికి రుణ మంజూరు లక్ష్యమన్నారు. ఒక్కో లబ్ధిదారునికి స్వయం ఉపాధి నిమిత్తం రూ.10 వేలు చొప్పున బ్యాంకు లింకేజీ రుణం ఇప్పించాలని వివరించారు. అర్హులందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ బాబూరావు, ఎల్‌డీఎం యుగంధర్‌రెడ్డి, మెప్మా పీడీ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని