logo

పరీక్షలు ముగిసె.. ఆనందం విరిసె

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు మొత్తం 26,118 మంది విద్యార్థులకు గాను 24,897 మంది హాజరయ్యారు. తుపాను వల్ల వాయిదా పడిన జూనియర్‌ ఇంటర్‌ పరీక్ష మాత్రం ఈనెల 25న జరగనుంది. ఇక పరీక్షలు

Published : 20 May 2022 02:02 IST


మళ్లీ కలుద్దాం: పరీక్షలు పూర్తయిన తర్వాత సహచర విద్యార్థినుల ఫోన్‌ నంబర్లు తీసుకుంటూ..

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరిరోజు మొత్తం 26,118 మంది విద్యార్థులకు గాను 24,897 మంది హాజరయ్యారు. తుపాను వల్ల వాయిదా పడిన జూనియర్‌ ఇంటర్‌ పరీక్ష మాత్రం ఈనెల 25న జరగనుంది. ఇక పరీక్షలు పూర్తయిపోయిన అనేకమంది విద్యార్థులు వసతిగృహాలను ఖాళీ చేసి స్వస్థలాలకు బయలుదేరారు. ఒకరికొకరు వీడ్కోలు పలికారు. ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సందడి నెలకొంది. అలాగే పోలీసుస్టేషన్లలో భద్రపరిచిన పదోతరగతి ప్రశ్నపత్రాలను చీఫ్‌ సూపరింటెండెంట్లు తీసుకొని పాఠశాలలకు చేర్చాలని డీఈవో విజయభాస్కర్‌ ఒక ప్రకటనలో కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని