logo
Published : 21 May 2022 06:30 IST

రండి..రండి మహానాడుకు!

 ఇంటింటా ఆహ్వానిస్తున్న తెలుగు మహిళలు


మహానాడు ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,
 పార్టీ కార్యనిర్వాహక  కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు సమీప మండువవారిపాలెం వద్ద ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమానికి రావాల్సిందిగా నగర తెదేపా మహిళలు వినూత్నంగా ఆహ్వానిస్తున్నారు. ఒంగోలులో శుక్రవారం ఇంటింటా తిరిగి బొట్టు పెట్టి మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమంలో తెదేపా పార్లమెంటు అధ్యక్షురాలు రావుల పద్మజ, నగర పార్టీ అధ్యక్షురాలు పసుపులేటి సునీత, ఎల్‌టీ భవానీ, కొక్కిలగడ్డ లక్ష్మి, కత్తి పద్మ, మేరీ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.  
పరిశీలించిన నేతలు
మహానాడు ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, ఒంగోలు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు నూకసాని బాలాజీ, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, వైవీ సుబ్బారావు, పి.వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. 


 బొట్టు పెట్టి ఆహ్వానపత్రం అందిస్తున్న మహిళా నేతలు 

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని