logo

పొగాకు బోర్డు ద్వారా ఎరువుల సరఫరా

రానున్న సీజన్‌కు పొగాకు బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేసేందుకు కమిటీ సభ్యులు ఆమోదించారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం వేలం కేంద్రాల అధికారులు, రైతు నాయకుల సమావేశం జరిగింది. 2022-23 సీజన్‌కు రైతుల

Published : 21 May 2022 06:30 IST


సమావేశంలో సూచనలిస్తున్న బోర్డు ప్రాంతీయ కార్యనిర్వహణాధికారి 
దివి వేణుగోపాల్, మేనేజర్‌ దామోదర్, సభ్యులు

కొత్తపట్నం, న్యూస్‌టుడే: రానున్న సీజన్‌కు పొగాకు బోర్డు ద్వారా ఎరువులు సరఫరా చేసేందుకు కమిటీ సభ్యులు ఆమోదించారు. ఒంగోలు దక్షిణ బైపాస్‌లోని బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం వేలం కేంద్రాల అధికారులు, రైతు నాయకుల సమావేశం జరిగింది. 2022-23 సీజన్‌కు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి సీటీఆర్‌ఐ సిఫార్సు మేరకు ఎరువులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆసక్తి ఉన్న రైతుల నుంచి ముందుగా బేళ్ల అమ్మకాల్లో నగదును మినహాయించుకోనున్నారు. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లో రూ.6 వేలు, ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లో రూ.7 వేల చొప్పున బ్యారన్‌కు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు ప్రాంతీయ కార్యనిర్వహణాధికారి దివి వేణుగోపాల్‌ తెలిపారు. సమావేశంలో మేనేజర్‌ దామోదర్, బోర్డు సభ్యులు మారెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎరువుల సరఫరా కమిటీ ఛైర్మన్‌గా వడ్డెళ్ల ప్రసాద్, వైస్‌ ఛైర్మన్‌గా నరసప్పనాయుడు, కార్యదర్శిగా కొత్తపల్లి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని